ఆస్ట్రొనాట్‌ శిక్షణలో భారత విద్యార్థులు

SMTV Desk 2019-05-02 13:48:10  17 Indian students attend Honeywell Leadership Challenge Academy at U.S. Space and Rocket Center, U.S. Space and Rocket Center,

వాషింగ్టన్: అమెరికా స్పేస్‌ క్యాంప్‌లో ఆస్ట్రొనాట్‌ శిక్షణకు భారత విద్యార్థులు చోటు సంపాదించారు. ఈ శిక్షణకు ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలకు చెందిన 292 మంది అవకాశం దక్కించుకోగా, ఇండియా నుంచి హనీవెల్‌ లీడర్‌షిప్‌ చాలెంజ్‌లో నిలిచిన 17 మందికి అవకాశం అందించింది. అలబామాలోని హంట్స్‌విల్లేలో యూఎస్‌ స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్‌ రెండు వారాల పాటు వీరిని ప్రోత్సహిస్తోందని, కోడింగ్‌లో ప్రత్యక్ష అనుభూతుల ద్వారా కలిగే నైపుణ్యాలు, కంప్యూటర్‌ సైస్సెస్‌, ఆస్ట్రోనాట్‌ రంగం గురించి వీరికి మరింత అవగాహన కల్పిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన తిరుమలశెట్టి రోహిత్‌ ఈ అవకాశం దక్కించుకున్నవారిలో ఉన్నారు.