చంద్రబాబు ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తారు: కన్నా లక్ష్మీనారాయణ

SMTV Desk 2019-05-02 12:55:22  ap cm, chandrababu, kanna lakshmi narayana

అమరావతి: ఏపీ బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ దుస్తులు మార్చడంపై దృష్టి పెడుతారని, దేశ ప్రజలను పట్టించుకోరని ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు ఈ మధ్య ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై కన్నా స్పందించారు. మోడీ గంటకో సారి దుస్తులు మారుస్తారో లేదో తెలియదని, అయితే చంద్రబాబు మాత్రం ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తారని కన్నా విమర్శించారు. చంద్రబాబు నిమిషానికో మాట చెబుతూ, నిజాయితీగా ఉన్న అధికారుల సీట్లు మారుస్తారని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల ఎంఎల్ఎలను కొని, వారి పార్టీ మార్చారని, ఈ క్రమంలోనే ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు సీటు మార్చనున్నారని కన్నా తేల్చి చెప్పారు.