సివిల్ సర్వెంట్లకు కేంద్రం తీపి కబురు..

SMTV Desk 2017-08-22 13:35:12  civil services, ias, ips, uppsc,

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22 : సివిల్ సర్వీసుల వైపు వెళ్ళే వారికి కేంద్రం ఒక తీపి కబురును అందించింది. వారికి రాష్ట్రాలను ఎంచుకునే విషయంలో మరింత వెసులుబాటును కల్పించింది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యే వారు దేశంలోని ఏ రాష్ట్రానైనా ఎంచుకోవడానికి కేడర్ నిబంధనలను సవరించనుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం... దేశం మొత్తాన్ని ఆరు గ్రూపులుగా విభజించి, ఏ గ్రూప్ వారు ఆ గ్రూపులోని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే విధంగా నిబంధనల్లో కొన్ని మార్పులను తీసుకురానున్నారు. దీనికోసం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించనున్నట్లుగా సమాచారం. యూపీఎస్సీకి ఎంపికైన అభ్యర్థి తన సొంత రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యతగా, మిగిలిన అన్ని జోన్లలోని మరో రాష్ట్రాన్ని కూడా రెండో ప్రాధాన్యతగా ఎంపిక చేసుకునే విధ౦గా నిబ౦ధనలలో మార్పులను తీసుకురానున్నారు.