వాట్సాప్ లో ఇన్సూరెన్స్ సర్వీసెస్

SMTV Desk 2019-05-02 12:33:18  whatsapp insurance, whatsapp, whatsapp update, whatsapp business, bharathi axa general insurance

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు వాట్సాప్ ద్వారా టూవీలర్ ఇన్సూరెన్స్ తీసుకునేలా ఈ కంపెనీ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్ విష్‌ఫిన్ కంపెనీకి చెందిన విష్‌ఫిన్ ఇన్సూరెన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో భారతీ ఆక్సా తన పాలసీలను విష్‌ఫిన్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లోనూ కస్టమర్లకు అందబాటులో ఉంచనుంది. కస్టమర్లు పాలసీ తీసుకోవాలని భావిస్తే.. 8527844822 నెంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వాలి. తర్వాత వాట్సాప్ ద్వారా క్షణాల్లో పాలసీ పొందొచ్చు. భారతీ ఆక్సా వినూత్న సేవల నేపథ్యంలో టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా క్షణాల్లో తీసుకోవచ్చు. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో వాట్సాప్‌లో టూవీలర్ ఇన్సూరెన్స్ సేవలు ప్రారంభించిన తొలి కంపెనీగా రికార్డ్ నెలకొల్పామని భారతీ ఆక్సా తెలిపింది. ఇకపోతే విష్‌ఫిన్.. బిజినెస్ సేవల కోసం గతేడాది వాట్సాప్‌తో భాగస్వామ్యం కుదుర్చకుంది.