తగ్గుముఖం పట్టిన డీజిల్, పెట్రోల్ ధరలు

SMTV Desk 2019-05-02 12:32:23  Petrol, Deseal, Price, New delhi

న్యూఢిల్లీ: గురువారం దేశీయ ఇంధన ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.73.07కు, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.66.66కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే తగ్గాయి. పెట్రోల్ ధర రూ.78.64కు, డీజిల్ ధర రూ.69.77కు క్షీణించింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గింది. దీంతో ధర రూ.77.47కి తగ్గింది. ఇక డీజిల్ ధర 6 పైసలు క్షీణించింది. దీంతో ధర రూ.72.42కు దిగొచ్చింది. అమరావతిలో పెట్రోల్‌ ధర 9 పైసలు క్షీణించింది. దీంతో ధర రూ.77.17కు తగ్గింది. ఇక డీజిల్‌ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.71.77కు క్షీణించింది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.82కు, డీజిల్ ధర రూ.71.44కు తగ్గింది.