‘సువర్ణ సుందరి’ రిలీజ్ డేట్ ఫిక్స్

SMTV Desk 2019-05-02 12:16:19  Suvarnasundari,

ప్రముఖ నటి పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, సాయికుమార్‌, జయప్రద ముఖ్యపాత్రలు పోషిస్తూ.. తెరకెక్కుతున్న సినిమా ‘సువర్ణ సుందరి’. ఎంవీకే రెడ్డి సమర్పణలో, లక్ష్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్‌ సూర్య పాంటసీ థ్రిల్లర్‌గా తెరపైకి తెస్తున్నారు. తాజాగా రిలీజ్‌ అయిన సువర్ణ సుందరి ట్రైలర్‌ ప్రేక్షకులను సస్పెన్స్‌లో పడేసింది. మే 31న సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా బృందం వెల్లడించింది.

గత జన్మలోని సంఘటనలు, పరిస్థితులో ప్రస్తుత జన్మలో ఎదుర్కోవాల్సి వస్తే ఏం జరుగుతుంది, వాటిని ఎలా ఎదుర్కున్నారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకే ఈ సినిమాకు ‘హిస్టరీ ఆల్వేస్ హంట్స్ ఫ్యూచర్’ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చారు. మూడు జన్మల నేపథ్యంలో జరిగే ఈ సినిమా దాదాపు 1509 నాటి కాలఖల్ రాజసంస్థానం అప్పటి సువర్ణ సుందరి(బొమ్మ) చుట్టూ కథ సాగేలా ఉంది. విజువల్‌ ఎఫెక్ట్.. సస్పెన్స్‌ డైలాగ్‌లతో ట్రైలర్‌కు మాత్రం మంచి స్పందన లభిస్తోంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో మే 31న చూడాల్సిందే.