పార్టీలో చేరే విషయంలో పెద్ద తప్పే చేశా: నాగబాబు

SMTV Desk 2019-05-01 19:19:18  nagababu, janasena, pawan kalyan

అమరావతి: జనసేన పార్టీలో మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ రంగ ప్రవేశం చేసి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన రాజకీయ ప్రవేశం గురించి నాగబాబు తాజాగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పవన్ కల్యాణ్ ఓ రోజు నాగబాబును పిలిచి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తావా అన్నయ్యా? అని అడిగాడు. అంత సడెన్ గా పవన్ అలా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక… వెంటనే ఎస్ కానీ నో కానీ చెప్పలేక తనకు 12 గంటల సమయం కావాలని అడిగాను. తర్వాత ఉదయం ఫోన్ చేసి ఓకే చెప్పాను. అంటూ చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్న నాగబాబు.. తమ్ముడికి అంత సమయం కోరి చాలా పెద్ద తప్పు చేశానన్నారు నాగబాబు. అవును.. తమ్ముడు అడగ్గానే ఓకే అనాలి కానీ.. 12 గంటల సమయం కోరడమేంది. జనసేనలో చేరే విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని అనిపించింది.. అని నాగబాబు తెలిపారు. జనసేన కోసం ఎటువంటి పనికైనా సిద్ధపడాలి. ఎంపీగా పోటీ చేయాలని అడిగే సరికి ఎందుకంత టైమ్ తీసుకున్నానో నాకే అర్థం కాలేదు. కానీ.. అది ఇప్పుడు తప్పుగా అనిపిస్తోంది. తమ్ముడు విషయంలో తప్పు చేశానని అనిపిస్తోంది. ఎంపీగా పోటీ అనగానే మొదటగా కాస్త భయమేసింది. ఆ భయంతోనే నా నిర్ణయాన్ని వెంటనే తమ్ముడికి చెప్పలేకపోయాను కానీ.. వేరే దేని గురించీ కాదు.. నరసాపురం ప్రజలు తనను ఎంతగానే ఆదరించారు. వారి అభిమానాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను.. అని నాగబాబు అన్నారు.