ఫేస్‌బుక్‌లో కేసీఆర్, కవితలపై అసభ్యకర పోస్ట్‌లు : వ్యక్తి అరెస్ట్

SMTV Desk 2019-05-01 19:16:50  kcr, kavitha, facebook posts

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతని కూతురు ఎంపీ కవితలపై దుష్ప్రచారం చేస్తూ ఫేస్‌బుక్‌లో వారిపై అసభ్య పోస్ట్‌లు పెడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు ఉన్నాయంటూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఫేస్‌బుక్‌ ఖాతాల్లో సీఎం కేసీఆర్‌, కవితలను ఉద్దేశించి అసభ్య పోస్టులున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌ నిర్వాహకులను సంప్రదించి ఐపీ అడ్రెస్స్‌లు తీసుకున్నారు. వీటి ఆధారంగా ఎస్సై మదన్‌ విచారణ జరిపి.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌లో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి చిప్రా నరేష్‌ ఇదంతా చేస్తున్నాడని గుర్తించారు. మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.