ట్రిపుల్ తలాక్ పై సుప్రీం కోర్ట్ ఆదేశం!!

SMTV Desk 2017-08-22 11:55:33  new delhi, supreem court, triple thalaq, divorce

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22 : ట్రిపుల్ తలాక్ పేరుతో ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్ట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీం కోర్ట్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. సుదీర్ఘకాలంగా వాదనలు విన్న న్యాయస్థానం ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలల పాటు స్టే విధిస్తూ చట్టంలో సవరణలు చేసి దీనిపై పార్లమెంట్ లో నూతన చట్టం తీసుకురావాలని కోరింది. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడడం అత్యంత హేయమైన చర్యంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా కేవలం ట్రిపుల్ తలాక్ అని ఫోనులో, సామాజిక మాధ్యమాలలో చెప్పడం సమ్మతం కాదు, అటువంటివి చెల్లవంటూ పేర్కొంది. నూతనంగా చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకురావాలని సుప్రీంకోర్ట్ పార్లమెంటుకు సూచించింది.