ఈ నెలలో మార్కెట్‌లోకి 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్లు

SMTV Desk 2019-05-01 17:45:54  smart phones, one plus 7, google pixel 3a, hmd global

ముంబై, మే 01: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా చాలా స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లోకి వచ్చేశాయి.

రియల్‌మి 3 ప్రో, రెడ్‌మి 7, రెడ్‌మి వై3, ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 3 ప్లస్, ఒప్పొ ఏ5ఎస్, వివో వై17 వంటి ఫోన్లు ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్పుడు గూగుల్, వన్‌ప్లస్, హానర్, నోకియా వంటి దిగ్గజ సంస్థలు మే నెలలో కొత్త ఫోన్లు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యాయి.

వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో: వన్‌ప్లస్ కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది. మే 14న వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్లు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వీటిపై చాలా అంచనాలే ఉన్నాయి. వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్‌లో క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ ఫాస్ట్ రిఫ్రెస్ రేటు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇక అలాగే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+16 ఎంపీ+ 8 ఎంపీ), పాపప్ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6.7 అంగుళాల స్క్రీన్ వంటి ప్రత్యేకతలు ఉండే అవకాశముంది.

గూగుల్ పిక్సల్ 3ఏ, పిక్సల్ 3ఏ ఎక్స్ఎల్: గూగుల్ కంపెనీ కూడా మరో రెండు కొత్త ఫోన్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతోంది. వీటి పేర్తు పిక్సల్ 3ఏ, పిక్సల్ 3ఏ ఎక్స్ఎల్. మే 7న ఈ ఫోన్లను లాంచ్ చేయనుంది. పిక్సల్ 3ఏలో 5.6 అంగుళాల డిస్‌ప్లే, పిక్సల్ 3ఏ ఎక్స్ఎల్‌లో 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉండనుంది. అలాగే పిక్సల్ 3ఏ ఎక్స్ఎల్‌లో 12.2 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. ఇక రెండు ఫోన్లలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ ఉండనుంది. వీటి ధర రూ.33,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.

హెచ్ఎండీ గ్లోబల్ నెల కిందట నోకియా 9 ప్యూర్‌వ్యూతో పాటు నోకియా ఎక్స్71 ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు నోకియా 8.1 ప్లస్ ఫోన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. మే నెలలోనే ఈ ఫోన్ లాంచ్ చేయవచ్చు.

హానర్ కంపెనీ హానర్ 20, హానర్ 20 ప్రో ఫోన్లను మే 21న లండన్‌లో ఆవిష్కరించే అవకాశముంది. హానర్ 20లో కిరిన్ 980 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్, మలి జీ76 జీపీయూ, డ్యూయెల్ ఎన్‌పీయూ, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లకు ఛాన్స్ ఉంది. ఇక హానర్ 20 ప్రో ఫోన్‌లో క్వాడ్ కెమెరా వ్యవస్థ ఉండొచ్చు. ఇక రెండింటిలోనూ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశముంది. ధర రూ.30,000 నుంచి ప్రారంభం కావొచ్చు.

ఆసస్ కంపెనీ మే 16న ఈ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఆసస్ జెన్‌ఫోన్ 6జడ్లో క్వాల్‌కామ్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, బెజిల్‌లెస్ డిస్‌ప్లే, పంచ్ హోల్ డిస్‌ప్లే కెమెరా, పాపప్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను ఆశించొచ్చు. దీని ధర రూ.30,000లోపు ఉండొచ్చు.