కియారా అద్వానీ కోపంతో ఎం చేసిందో తెలిస్తే షాక్ ...

SMTV Desk 2019-05-01 16:40:35  Kiara advani,

తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బాలీవుడ్ నటి కియారా అద్వానీ కోపంతో తల వెంట్రుకలు కత్తిరించేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా లో వైరల్ అవుతుంది . తల వెంట్రుకలకు చక్కగా నూనె పెట్టుకోవాలనీ.. తగిన సంరక్షణ తీసుకోవాలని కియారా తల్లి ఎప్పుడూ చెబుతుంటుందట. కానీ తనకున్న బిజీ షెడ్యూల్‌ కారణంగా కియారా ఆ పని చేయడంల లేదట. దీంతో తన హెయిర్‌ అంతా పాడైపోయిందని బాధపడ్డ కియారా.. ఏ మాత్రం ఆలోచించకుండా.. తన వెంట్రుకల్ని కత్తిరించేసుకుంది.దీనికి సంబంధించిన వీడియోను కియారా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్‌ చేసింది. అంతేకాదు.. ‘వెంట్రులకు తగిన సంరక్షణ తీసుకోలేనప్పుడు, హెయిర్‌ పాడైపోయినప్పుడు, ఒకే ఒక పరిష్కారం ఉంది.. అది వెంట్రుకలను కత్తిరించుకోవడమే’ అంటూ వీడియెతో పాటు క్యాప్షన్‌ పెట్టింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరికి అలా కత్తిరించేసుకుందేంటి అనిపిస్తే.. ఇంకొందరు మంచి పని చేసింది అని ఫీల్ అవుతున్నారు.