శ్రీకాకుళంలో అలెర్ట్...అధికారులకు సెలవులు రద్దు

SMTV Desk 2019-05-01 15:25:21  fani, nellore fani tsunami, srikakulam

శ్రీకాకుళం: ఫణి తుఫాను మే 3వ తేదీన ఏపీలోని సముద్ర తీరం ప్రాంతాలను దాటనున్ననేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళంలో అధికారులను కలెక్టర్‌ నివాస్‌ అప్రమత్తం చేశారు. తుఫాన్‌ తీరం దాటి.. అంతటా ప్రశాంతత నెలకొనేవరకూ అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంత మండలాలలో ముందస్తు చర్యలు చేపట్టారు. మే 01వ తేదీ బుధవారం సాయంత్రానికి 36 సహాయక బృందాలు ఇక్కడకు చేరుకొంటాయి. తుఫాను పరిస్థితి పర్యవేక్షణ కోసం 14 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. 150 జేసీబీలు, 200 జనరేటర్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపారు.