ధోని ఇవాళ కూడా డౌటే!

SMTV Desk 2019-05-01 15:20:51  mahendra singh dhoni, ipl 2019, csk vs dc

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు చెన్నై వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, డిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆడడం అనుమానంగానే ఉందని సమాచారం తెలుస్తోంది. జ్వరం బారిన పడిన ధోనీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే ధోనీ ఆడే విషయం టాస్‌కు ముందు నిర్ణయం తీసుకుంటాం అని చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు. జడేజా, డుప్లెసిస్‌లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని ఫ్లెమింగ్‌ తెలిపాడు. ఇది మాత్రం చెన్నైకి కలిసొచ్చే అంశం. ధోనీ మంగళవారం నిర్వహించిన ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొనలేదు. మరోవైపు ప్రాక్టీస్‌ సెషన్‌కు కూడా దూరంగా ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడడనే అర్ధమవుతోంది. మరి ధోనీ ఆడేది లేనిది టాస్ పడితే గాని తెలియరాదు. ధోనీ జ్వరం కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. ఆ మ్యాచ్‌లో చెన్నై 46 పరుగులతో ఓడిపోయింది. ఇక చెన్నై, డిల్లీ రెండూ టేబుల్ టాపర్లు కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గి ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు చూస్తున్నాయి.