రోహిత్...యువీకి ఐపీఎల్ లో చాన్స్ ఇవ్వడా!!!

SMTV Desk 2019-05-01 15:19:26  yuvaraj singh, rohit sharma, ipl 2019, mumbhai indians

ముంభై: ఐపీఎల్ అన్ని జట్లతో పోలిస్తే సీనియర్ ఆటగాలతో ఎప్పుడూ బరిలోకి దిగుతూ టాప్ లో ఉండే జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టు తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న ఆటగాళ్ళు ఉండేది ముంభై ఇండియన్స్. ఐపీఎల్ లో ఈ రెండు జట్ల తరువాతే ఏదైనా. ఇకపోతే ఈ సీజన్లో చెన్నైని సైతం దాటేసి టాప్ లో కూర్చుంది ఢిల్లీ కాపిటల్స్. చెన్నై రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా మూడో స్థానంలో ముంభై ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి రెండు జట్లు మాత్రమె ప్లే ఆఫ్ కు వెళ్ళాయి. మొదట చెన్నై ప్లే ఆఫ్ లో ఎంట్రీ ఇవ్వగా దాని తర్వతా ఢిల్లీ ఊహించని ఎంట్రీ ఇచ్చింది. ముంభై కి మాత్రం ఇంతవరకు ప్లే ఆఫ్ కు వెళ్ళలేదు. అయితే ముంభై, కోల్ కత్తాతో జరిగిన చివరి మ్యాచ్ లో కోల్ కత్తా 34 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ముంభైకి ప్లే ఆఫ్ కు చాన్స్ రాలేదు. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిసి ఉంటె ఇప్పటికి ముంభై ప్లే ఆఫ్ కు చేరేది. అయితే ముంభై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్లే ఆఫ్ పై అనేక ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆటగాళ్ళలో అనేక మార్పులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముంభై ఆటగాడు యువరాజ్ సింగ్ ను రోహిత్ దూరం పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికి ముంభై 12 మ్యాచ్ లు ఆడి యువీని కేవలం నాలుగు మ్యాచ్ ల్లోనే ఆడించింది. మొదట ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఆ తరువాత బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో ఆడిన యువీ 12 బంతులకు 23 పరుగులు చేశాడు. అనంతరం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 22 బంతులకు 18 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఏప్రిల్ 3 న చెన్నై తో జరిగిన మ్యాచ్ లో 5 బంతులకు కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్ లు ఆడిన యువీ 98 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఈ నాలుగు మ్యాచ్ ల్లో రెండు గెలువగా మరో రెండు పరాజయ పాలయ్యాయి. అయితే రోహిత్.... యువీ పేలవ ఆట తీరుపై అసంతృప్తి చెంది...ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలనే ఉద్దేశ్యంతో అతన్ని మిగిత మ్యాచ్లకు దూరం చేస్తున్నాడని సమాచారం. ఇక ప్లే ఆఫ్ కు వెళ్లేముందు ముంభై ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమె ఆడుతుంది. అందులో ఒకటి మే 2న హైదరాబాద్ జట్టుతో తలపడగా మే 5న కోల్ కత్తాతో తలపడేందుకు సిద్దంగా ఉంది. అయితే రోహిత్ ఈ రెండు మ్యాచ్ లకు కూడా యువీని దూరం చేస్తాడ లేక జట్టులో ఆడనిస్తాడ అనేది వేచి చూడాలి.