రేషన్ షాపుల్లో ఐరిస్ విధానం అమలు

SMTV Desk 2019-05-01 13:51:52  iris system in ration shops, telangana state government

హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఐరిస్ విధానాన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. అయితే హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. కాగా దీనికోసం పౌరసరఫరాలశాఖ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాల్లోని రేషన్ డీలర్లకు ఇప్పటికే తర్పీదునిచ్చిన అధికారులు ఐరిస్ యంత్రాలను కూడా అందజేశారు. దీంతో నేటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలవుతుందని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ దుకాణాలుండగా ఇందులో దాదాపు ఎనిమిది వందలకుపైగా హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. దీంతో పాటు మరో ఐదు వేలకుపైగా దుకాణాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతుంది. మిగిలిన దుకాణాల్లో నేటి నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు.