రష్యా సైన్యంలో తిమింగలాలు!

SMTV Desk 2019-05-01 13:50:20  Beluga whale, Russian weapon

రష్యా: రష్యా దేశం తమ సైన్యంలోకి తిమింగాలాలను కూడా చేర్చుకుంటుంది. అంతేకాక వాటికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రత్యర్థులపై దాడికి పంపిస్తుంది. తాజాగా ఓ సంఘటన బయటకొచ్చింది. నార్వేలోని ఇంగ్రా గ్రామంలో నీటి ప్రవాహం గుండా కొందరు జాలర్లు పడవల్లో వెళ్తున్నారు. ఇంతలో బెలుగా జాతికి చెందిన తెల్లటి తిమింగలం ఒకటి సముద్రం నుంచి పైకి వచ్చి కనిపించింది. దాన్ని చూడగానే పడవల్లో వాళ్లంతా ముచ్చట పడ్డారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ తిమింగలం వాళ్ల పడవల్ని ఢీకొట్టి బోల్తాకొట్టించింది. దీంతో పడవల్లో వున్నవాళ్లంతో నీళ్లల్లో పడిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఇంతలో ఆ తిమింగలం మాయమైంది. అయితే అప్పుడే వారు ఈ విషయాన్ని గమనించారు. వాటికి రష్యా నౌకాదళం ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తోందని తెలిసింది. శిక్షణ తీసుకున్న తిమింగలాల మెడకు… ఓ తాడు (Harness) కట్టి ఉంటోందనీ, వాటిని ప్రత్యేకంగా గుర్తించడానికే ఆ తాడు కడుతున్నారని అంటున్నారు. ఈ బెలుగా తిమింగలాలు ఎక్కువగా రష్యాలో కనిపిస్తుంటాయి. అక్కడి కొందరు సముద్ర రక్షణ నిపుణులు… వాటిని సంరక్షిస్తుంటారు. ఇదిలావుండగా 1980లో సోవియట్ రష్యా… డాల్ఫిన్లకు మిలటరీ ట్రైనింగ్ ఇచ్చిందని సమాచారం. ఎందుకంటే డాల్ఫిన్లు చాలా బాగా చూడగలవు, పోరాడగలవు, బలంగా ఉంటాయి, మెమరీ పవర్ కూడా ఎక్కువని వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. సముద్రంలో మునిగిపోయిన ఆయుధాల్ని కనిపెట్టేందుకు వాటిని రష్యా ఉపయోగించేదని తెలిసింది.2017 నుంచీ రష్యా మళ్లీ అదే కార్యక్రమం ప్రారంభించిందట. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆర్కిటిక్ ఉత్తర ధృవ తీర ప్రాంతంలోని సోవియట్ మిలిటరీ బేస్‌ను తిరిగి తెరిచారనీ, అక్కడ డాల్ఫిన్లకు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది. ఈక్రమంలో నార్వేలో పడవల్లో వెళ్తున్న వారంతా ఎప్పుడు ఏ తిమింగలం దాడిచేస్తుందోనంటూ భయపడే పరిస్థితి నెలకొంది.