ట్రంప్ మరో సంచలనం

SMTV Desk 2017-08-22 10:58:35  Trump, US President, Solar eclipse, Melania

అమెరికా, ఆగస్ట్ 22: 1979 తరువాత ఏర్పడిన అతిపెద్ద సూర్యగ్రహణం అమెరికా అంతటా కనువిందు చేయగా, దీనిని ప్రజలు వీక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రజలతో పాటు సూర్యగ్రహణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, కుమారుడు బ్యారన్‌లు కూడా ఆసక్తిగా వీక్షించారు. అయితే సూర్యగ్రహణాన్ని ఏలాంటి రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా వీక్షిస్తే కళ్లకు ప్రమాదకరం అనే విషయం సుపరిచితమే. దీన్నేమీ పట్టించుకోని ట్రంప్... గ్లాసెస్ లేకుండానే గ్రహణాన్ని వెరైటీగా కళ్లు మూస్తూ తెరుస్తూ వీక్షించారు. అలా చూడకూడదంటూ పక్కనున్నవారు వారించడంతో... ఆ తర్వాత కళ్ల జోడు ధరించి గ్రహణాన్ని చూశారు. అయితే ఆ సమయంలో ఆయన నేరుగా ఆకాశం వైపు చూస్తున్నారా లేదా అనేది తెలియదు. గ్రహణం కారణంగా ఒరెగాన్‌ నుంచి దక్షిణ కరోలినా వరకు 14 రాష్ట్రాల మీదుగా 96 కి.మీ నుంచి 113 కి.మీ మేర చీకటి అలముకుంది.