రాష్ట్ర కార్మికుల భవిష్యత్తుకు, భద్రతకు భరోసా : చంద్రబాబు

SMTV Desk 2019-05-01 12:38:52  may day, may 1, ap cm, chandrababu

అమరావతి: మే 1 కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సంపద సృష్టికర్తలు కార్మికులు, శ్రమజీవులేనని అన్నారు. అలాగే చంద్రన్న బీమా, ఆదరణ-2, డ్రైవింగ్‌ స్కూలు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంపద సృష్టికి మూలమైన శ్రమను గౌరవించడం అందరి కర్తవ్యమన్నారు. దేశ ప్రగతికి పారిశ్రామికాభివృద్ధిని గీటురాయిగా భావిస్తారన్నారు. పారిశ్రామికాభివృద్ధికి బాటవేసేది కార్మికులు, కష్టజీవులేనన్నారు. రాష్ట్ర కార్మికుల భవిష్యత్తుకు, భద్రతకు భరోసా కల్పించామని పేర్కొన్నారు.