హైదరాబాద్‌లో బాలికల కోసం ప్రత్యేకంగా!!

SMTV Desk 2019-05-01 12:23:27  womens polytechnic college, polycet result, govt womens college, polytechnic counselling

మారేడుపల్లి, మే 01: ఇది వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నప్పటికీ వాటిల్లో కో- ఎడ్యుకేషన్ విధానం తప్ప బాలికలకు వేరుగా ఉమెన్స్ కాలేజీ అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీని మెరకు హైదరాబాద్‌ నగరంలో తొలిసారిగా బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల జూన్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.

కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇంగ్లీష్‌ ల్యాబ్‌, ట్యుటోరియల్‌, లైబ్రరీ, విశాలమైన గదులు, ఇతరతర సదుపాయాలతో మారేడుపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ బాలికల కళాశాలలో జూన్‌ 1నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌, హోమ్‌ సైన్స్‌ కోర్సులు నిర్వహిస్తారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు కేటాయిస్తారు. మే రెండో వారంలో జరిగే కౌన్సెలింగ్‌ అనంతరం ర్యాంకులు పొందిన విద్యార్థులు జూన్‌ 1వ తేదీ నుంచి తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.

గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ బాలికల కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులను ప్రిన్సిపాల్‌ నర్సయ్యగౌడ్‌, ఉపాధ్యాయులతో కలిసి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సంవత్సరం జూన్‌ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. కాగా ఈ మధ్యే పాలిసెట్ ఫలితాలు కూడా విడుదల అవ్వడం మన అందరికి తెలిసిన విషయమే.