వైరల్ అవుతున్న మహేష్ తాజా పిక్ ... పవన్, మహేష్ ఫాన్స్ ఫుల్ ఖుష్

SMTV Desk 2019-05-01 12:12:15  Mahesh Babu, Maharshi,

తెలుగు చలనచిత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన న్యూ సినిమా న్యూ లుక్ ఈ రోజు రిలీజ్ చేసారు . ఆ లుక్ ను చూసిన అభిమానులు మంత్రిముగ్దులౌతున్నారు. ఫ్యాన్స్ పదే పదే మహేష్ న్యూ లుక్ ను చూసుకుంటూ సినిమా పక్కా హిట్టబ్బా అంటూ సంబర పడుతున్నారు .కాగా మహర్షి సినిమా మే 9న రిలీజ్ కానుండటంతో సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడికి చేస్తున్నారు. కాగా వీరితో పాటు ఈరోజు పవన్ ఫ్యాన్స్ కూడా మురిసిపోయేలా మహేష్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

అదేమంటే ఈరోజు ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. అందులో మహేష్ బాబు గాజు గ్లాసులో టీ తాగుతూ సామాన్యుడిలా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్ చూసి పవన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ మహేష్ బాబు మా జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును పట్టుకొని ఉన్నాడంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. అలా తమ గ్లాసును మహేష్ చేతిలో చూసిన పవన్ ఫ్యాన్స్.. సహజమైన మహేష్ ఫ్యాన్స్ కలగలసి మురిసిపోతున్నారహో .