వెంకీ మామ ఫ్యాన్స్ కు గుండ్ న్యూస్

SMTV Desk 2019-04-30 19:35:14  venkatesh, Victory venkatesh,

స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో 3వ సీజన్ కు రెడీ అవుతుంది. మొదటి సీజన్ కు ఎన్.టి.ఆర్, రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. 3వ సీజన్ కు ఎన్.టి.ఆర్ ను చేయాలని కోరగా ట్రిపుల్ ఆర్ వల్ల కుదరదని చెప్పేశాడు. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, ఆఖరికి అనుష్క కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తుందని వార్తలు వచ్చాయి.

అయితే ఫైనల్ గా విక్టరీ వెంకటేష్ బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా చేస్తాడని కన్ఫాం అయ్యింది. సంచలనాల శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ విషయాన్ని వెళ్లడించింది. వెంకీ మామ ఫ్యాన్స్ కు గుండ్ న్యూస్ బిగ్ బాస్ హోస్ట్ గా వెంకీ మామ చేస్తున్నాడని పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. వెంకటేష్ ను మామా అన్నది వెంకీమామా సినిమా గురించి కాదు అభిరాం కు గాళ్ ఫ్రెండ్ కాబట్టి శ్రీ రెడ్డి అనఫిషియల్ గా వెంకీ మామా అన్నదన్నమాట. మొత్తానికి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చి శ్రీ రెడ్డి బిగ్ బాస్ ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చింది.