సినిమాలకు గుడ్ బై

SMTV Desk 2019-04-30 19:22:42  Sharukh Khan,Bollywood

బాలీవుడ్ బాధ్షా షారుఖ్ ఖాన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన షారుఖ్ ఇప్పుడు ఆయన సినిమాలంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవడం అటుంచితే కనీసం వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. వరుస ఫ్లాపులతో షారుఖ్ విసిగిపోయి ఉన్నాడు. తను ఎంతో కష్టపడి భారీ అంచనాలతో తీసిన జీరో సినిమా కూడా ఫ్లాప్ అవడంతో షారుఖ్ ఖాన్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు.

అందుకే జీరో తర్వాత తన కొత్త సినిమా ఏది మొదలు పెట్టలేదు. ఏదో ఒకటి చేసేద్దాం అనుకోకుండా ఈసారి మంచి కథ.. మనసుకి నచ్చిన సినిమా చేయాలని చూస్తున్నాడట షారుఖ్. అందుకోసం కొంత వెయిట్ చేసినా పర్వాలేదని చెబుతున్నాడు. అంతేకాదు కెరియర్ ను కూడా ముగించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. తన వారసులను ఇండస్ట్రీకి ప్రవేశ పెట్టే ఆలోచనలో తను ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నాడట షారుఖ్. కచ్చితంగా షారుఖ్ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్త అన్నట్టే.