రాహుల్ భారతీయుడే అని దేశమంతా తెలుసు!

SMTV Desk 2019-04-30 17:48:27  priyanka gandhi, rahul gandhi, bjp mp subrahmanyam swamy, central home minister

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బ్యాకప్స్‌ లిమిటెడ్‌ కంపెనీని రిజిస్టర్ చేసుకోడానికి సమర్పించిన పత్రాల్లో అతని పేరు డైరెక్టర్‌గా ఉందని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించి అతను భారతీయ పౌరుడు కాదని ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ నుంచి వివరణ కోరుతూ నోటీసులు కూడా జారీ చేసింది కేంద్ర హోంశాఖ. అయితే ఈ కార్యకలాపాలపై స్పందించిన ప్రియాంక గాంధీ సుబ్రహ్మణ్యస్వామిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాహుల్ ఇక్కడే పుట్టాడని, ఇక్కడే పెరిగాడని.. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాహుల్‌ పౌరసత్వం గురించి దేశంమంతటికీ తెలసినప్పటికీ ఆ ఆరోపణలు చర్చలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. అనవసరంగా బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని రచ్చ చేస్తుందని ప్రజలు ఎలాంటి అసత్య ఆరోపణలు నమ్మవద్దనీ ప్రియాంక సూచించారు.