ధోని ఆమ్రపాలి కేసులో సుప్రీం కీలక నిర్ణయాలు

SMTV Desk 2019-04-30 17:44:10  mahendra singh dhoni, amrapali group, supreme court

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆమ్రపాలి రియల్‌ ఎస్టేల్‌ సంస్థ తనకు బకాయిలు చెల్లించలేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దానితో ఎలాంటి లావాదేవీలు జరిగాయో పూర్తి వివరాలు సపర్పించాలని ఆమ్రపాలి సంస్థను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సంస్థకు ధోని 2009-16 వరకు పనిచేశారు. రాంచీలో నిర్మిస్తున్న ఆమ్రపాలి ప్రాజెక్టులో ఓ పెంట్‌హౌస్‌ బుక్‌ చేసుకున్నానని, దాన్ని తనకు అప్పగించే ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ధోని సుప్రీంను కోరాడు. కానీ కొన్ని నెలల క్రితం ధోని అంబాసిడర్‌ డీల్‌ నుంచి వైదొలిగాడు. నోయిడాలో కంపెనీ ఏర్పాటు చేసిన గృహ ప్రాజెక్టుపై కొనుగోలుదారుల నుంచి తీవ్రత అసంతృప్తి వ్యక్తం కావడంతో ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ధోని ఇకపై తమ సంస్థ తరఫున ప్రచారం చేయబోరని కూడా ఆమ్రపాలి సిఎండి అనిల్‌ శర్మ ప్రకటించారు. ఈ నిర్ణయం ధోనితో కలిసి తీసుకున్నదేనని ఆయన స్పష్టం చేశారు.