ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్!!

SMTV Desk 2019-04-30 16:33:18  yamini sadhineni, tdp, ram gopal varma, lakshmis ntr

అమరావతి: టిడిపి అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రేపు ఏపీలో విడుదల కానున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ముందు ప్రెస్ మీట్ పెట్టాలని చూసిన వర్మకు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఈ సంఘటనపై స్పందించిన యామిని మాట్లాడుతూ… ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి సైకోకు వైసిపి అధినేత వైఎస్ జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, వర్మకు మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆర్జీవీ చేసిన తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. ఇక తనపై ఎవరైనా కామెంట్ చేస్తే విరుచుకుపడే ఆర్జీవీ… యామిని కి ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.