అమెజాన్‌ పే నుంచి మనీ ట్రాన్స్ఫర్

SMTV Desk 2019-04-30 15:02:31  amazon, amazon pay, amazon pay money transfer

అమెజాన్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్‌ పే ద్వారా వ్యాలెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఇక ఈ సేవలు సోమవారం నుచే ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పర్సన్‌ టూ పర్స్‌ పేమెంట్స్‌ ను ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ప్రారంభ ఆఫర్‌ కింద నగదు బదిలీ చేసే వినియోగదారులు రూ.120 వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని పేర్కొంది. అమెజాన్‌ పే ద్వారా జరిగే చెల్లింపులు చాలా భద్రంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే వస్తువులు, నిత్యావసరాలు విక్రయించడంతో పాటు, బిల్లు చెల్లింపుల సేవలను కూడా తన వినియోగదారులకు అమెజాన్‌ అందిస్తుంది.