మద్రాస్ హైకోర్టు మెట్లెక్కిన విశాల్

SMTV Desk 2019-04-30 15:00:45  madras high court, vishal

చెన్నై: ప్రముఖ సినీ హీరో విశాల్ మద్రాస్ హైకోర్టు మెట్లేక్కాడు. తమిళనాడు ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్ శేఖర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన నేపథ్యంలో విశాల్ కోర్టుకెళ్లారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం కాల పరిమితి పూర్తయిందని గుర్తు చేసిన ఆయన, ఆదాయ, వ్యయాలను సభ్యుల ముందు పెట్టేందుకు 1న సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేశామని, అప్పుడే తదుపరి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని, ఈ దశలో ప్రత్యేక అధికారి అవసరం లేదని పిటీషన్‌లో తెలిపాడు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని విశాల్ కోరగా, అందుకు అంగీకరించిన న్యాయమూర్తి, మంగళవారం నాడు విచారిస్తామని తెలిపాడు. దీంతో విశాల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.