బిగ్ బ్రేకింగ్: అబూ బకర్ అల్-బగ్దాదీ బ్రతికే ఉన్నాడు!!!

SMTV Desk 2019-04-30 14:59:41  isis chief isis chief abu bakr al baghdadi,

నరరూప రాక్షషుడు, ఒకప్పుడు యావత్తు ప్రపంచాన్నే వణికించిన ఐఎస్ఐఎస్చీఫ్‌ అబూ బకర్ అల్-బగ్దాదీ ఇంకా ప్రానాలతోనే ఉన్నాడు. సిరియా బాంబు దాడుల్లో ఈ ఉగ్రభూతం చనిపోయాడనుకుని ఊపిరి పీల్చుకున్నా .. ఐదేళ్ల తరువాత నేనున్నాంటూ కనిపించాడు. 2014 నుంచి కనిపించకుండా పోయిన బగ్దాదీ తాజాగా ఓ వీడియోలో దర్శనమిచ్చాడు. బాగౌజ్‌ కోసం పోరాటం ముగిసిందంటూ వీడియోలో తన ముందు కూర్చున్న వారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. పేలుళ్లకు పాల్పడిన వారిని ప్రశంసించారు. అయితే ఇస్లాంపై క్రైస్తవుల క్రూరత్వం, హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయన్నాయని, వాటికి ముగింపు తప్పదని హెచ్చరించాడు.