ఫణి ఎఫెక్ట్ : ఏపీకి నిధులు విడుదల

SMTV Desk 2019-04-30 14:58:15  central government passed huge ammount of cash to andhrapradesh,

అమరావతి: ఫణి పేరుతో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారి సముద్ర తీర ప్రాంతాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ఉండనుంది. దీంతో ఈ రాష్ట్రాలకు కేంద్రం ముందస్తుగా నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లకు జాతీయ విపత్తు నివారణ నిధి నుంచి రూ.1086 కోట్లను విడుదల చేసింది. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.