ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

SMTV Desk 2019-04-30 13:40:49  raod accident, Tamil nadu,

తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలాంగులం అనే ప్రాంతం వద్ద తిరునెల్వేలి నుంచి టెంకాసికి వెళుతున్న లారీ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో మురుగన్, నిరంజన్ కుమార్, రాజశేఖర్, శేష శ్రీ, డ్రైవర్ మహేష్, రెండు వారాల పసిపాప ఉన్నారు. ఘటనలో రాజప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.