ప్రేమ పేరుతో విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించిన సిఐ

SMTV Desk 2019-04-30 13:35:37  mvp police station ci harassed a student vishakapatnam, mvp police station

అమరావతి: ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే ఆపదగా మారుతున్నారు. తాజాగా ఓ విద్యార్ధినితో సిఐ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన విశాఖపట్నంలోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం...కృష్ణకుమారి, మీనాక్షి అక్కా చెల్లెలు ఎంవిపి కాలనీలో సెక్టార్-9లో నివసిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి కృష్ణకుమారి, తన మేనమామ తనయుడు విజయ్ భాస్కర్‌లు ప్రేమించుకుంటున్నారు. కృష్ణకుమారిని పక్కన పెట్టిన విజయ్ వేరే అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకుంటుండగా పోలీసులు సహాయంతో కృష్ణ కుమారి, మీనాక్షిలు అడ్డుకున్నారు. ఈ కేసు విషయంపై సిఐ సన్యాసినాయుడును మీనాక్షి కలుస్తుండేది. మీనాక్షి ఒక రోజు ఫోన్‌లో సిఐతో మాట్లాడుతుండగా నిన్ను ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మహిళా సంఘాల సహాయంతో మీనాక్షి ఎంవిపి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగింది. కమిషనర్ మహేష్ చంద్రలడ్డా ఈ విషయాన్ని పరిశీలించిన పిమ్మట సిఐ సన్యాసినాయుడును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఐ మీడియాతో మాట్లాడుతూ.. మీనాక్షి చెప్పిన దాంట్లో నిజం లేదని, విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని వివరించారు.