భారతదేశ దంపతుల కోసం తమ చట్టాలను పక్కనపెట్టిన దుబాయ్

SMTV Desk 2019-04-30 13:34:32  india government, uae government, uae government acceptance to give birth certificate who married Muslim girl in Dubai

యూఏఈ: భారతదేశ దంపతుల కోసం దుబాయ్ సర్కార్ తొలిసారి తన చట్టాలను పక్కన పెట్టింది. సాధారణంగా దుబాయ్ ప్రభుత్వాల చట్టాల ప్రకారం...ఓ ముస్లిం పురుషుడు వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ, ముస్లిం అమ్మాయి మాత్రం వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఈ క్రమంలో కేరళకు చెందిన కిరణ్ బాబు అనే హిందూ యువకుడు, సనమ్ సబూ సిద్దిఖీ అనే ముస్లిం యువతి 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు బతుకుదెరువు కోసం షార్జా వెళ్లారు. 2018 జూలైలో షార్జాలోని ఆస్పత్రిలో వారికొక పాప పుట్టింది. అప్పటి నుంచి అడుగడుగునా వారికి అడ్డంకులే ఎదురయ్యాయి.హిందూ–ముస్లిం దంపతులకు పుట్టిన తొమ్మిది నెలల పాపకు బర్త్​ సర్టిఫికెట్​ ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై కిరణ్ షార్జాలోని కోర్టులో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలల పాటు విచారించిన కోర్టు అతను హిందువు అన్న కారణంగా బర్త్​ సర్టిఫికెట్​ను తిరస్కరించింది. దీంతో కిరణ్ ఇండియన్ ఎంబసీని సంప్రదించాడు. వారు ఇచ్చిన చొరవతో ఏప్రిల్​ 14న తన కూతురికి యూఏఈ ప్రభుత్వం బర్త్​ సర్టిఫికెట్​ ఇచ్చింది. ఇలా రూల్స్ మార్చి సర్టిఫికెట్ ఇవ్వడం ఇదే తొలిసారంటూ అధికారులు చెప్పారు. ఇది ఇండియా దంపతుల కోసం మొట్టమొదటి సారి దుబాయ్ ప్రభుత్వం తన చట్టాలను పక్కనబెట్టిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కిరణ్ దంపుతులు.