బ్యాంక్ 'మే' సెలవులు

SMTV Desk 2019-04-30 12:44:17  banks, private banks, government banks, bank holidays in may 2019

న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు, నగదు లావాదేవీల వ్యవహారాలు జరిపేవారు మే నెల‌లో వచ్చే బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 11, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే మే నెల‌లో వ‌చ్చే నాలుగు ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. వీటికి అదనంగా మే 1న (బుధవారం) మే డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. కేవలం తెలంగాణలోని బ్యాంకులకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది. ఏపీలోని బ్యాంకులకు మే డే సందర్భంగా సెలవు లేదు. అయితే మే నెల మొత్తంలో 7 రోజులు సెలవలు రానున్నాయి. అయితే నెట్ బ్యాంకింగ్ చేసేవారికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా సాగుతాయి. ఆయా బ్యాంక్ సెల‌వు రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.