ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

SMTV Desk 2019-04-30 12:41:18  odisha, Uttarandhra, Rains

ఫొని తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం.. దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఫొని కొనసాగుతోంది. గంటకు 16 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఫొని….. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 690 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 36 గంటల్లో మరింత బలపడి పెను తుఫాన్ గా మారే అవకాశముంది. మే 1 సాయంత్రం వరకు వాయువ్య దిశగా ప్రయాణించి ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరానికి చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఫొని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముంది.