ఫేస్‌బుక్‌లో చనిపోయిన వారి ఖాతాలే ఎక్కువ!

SMTV Desk 2019-04-29 19:57:53  facebook, facebook dead people accounts

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కి అతి తక్కువ సమయంలో కొన్ని కోట్ల మందికి చేరి సంచలనం సృష్టించింది. ఇక కొంత కాలంగా ఫేస్‌బుక్‌ని ఆక్టివ్‌గా వినియోగిస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌పై ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2018 నాటి ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను ఆధారం చేసుకుని ఈ పరిశోధన జరిపింది. రాబోయే 50 సంవత్సరాల్లో ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్న వారిలో అధికులు మరణించి ఉంటారని తెలిపింది. 2100 కంటే ముందే 1.4 బిలియన్‌ ఫేస్‌బుక్‌ యూజర్లు చనిపోయి ఉంటారని పేర్కొంది. 2070 నాటికే ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య కంటే, మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ‘ఫేస్‌బుక్‌ తన సేవలను ఇలాగే కొనసాగిస్తూ వెళ్తే, మరో 50 సంవత్సరాలకు దానిని వినియోగిస్తున్న వారి కంటే చనిపోయిన యూజర్ల సంఖ్యే ఎక్కువ. ఈ శతాబ్దం చివరి నాటికి అలా చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4.9 బిలియన్‌లుగా ఉండవచ్చని తెలిపింది. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌లో ఉన్న యూజర్లు మరణిస్తే వారి డేటాపై ఎవరికి హక్కు ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. చనిపోయిన వారి ఖాతాలను వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొనసాగింవచ్చు. ప్రస్తుత పరిస్థితులు తెలుసుకునేందుకు భవిష్యత్‌ చరిత్రకారులు సైతం ఫేస్‌బుక్‌ డేటాను వినియోగించుకోవచ్చు’ అని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్‌ ఒహోమన్‌ అనే శాస్తవేత్త అభిప్రాయపడ్డారు.