విశాఖలో దారుణం: ఒకేసారి పేలిన ఆరు సిలిండర్లు....67 గుడిసెలు దగ్దం

SMTV Desk 2019-04-29 19:57:02  vishakapattanam, fire accident, six gas cylinders blast in single time

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చోడవరం శివారులోని ద్వారకానగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభంవించింది. గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో దాదాపు 67 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సుమారు ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అలాగే గాలి కూడా ఎక్కువగా ఉండడంతో మంటలు మరింత బలంగా వ్యాపించాయి. పోలవరం, మడుగులకు చెందినా ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఇళ్లల్లోని వస్తువులు, నగదు బూడిదయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయామని బోరున విలపించారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.