ఆర్.ఆర్.ఆర్ సినిమా తాజా సమాచారం

SMTV Desk 2019-04-29 19:01:19   rrr,

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ కు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి. పూణె షెడ్యూల్ లో సెకండ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా రాం చరణ్ కు యాంగిల్ గాయమవడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈమధ్యనే ఎన్.టి.ఆర్ కు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో గాయమైందట. ఇదిలాఉంటే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ కోకాపేటలో మొదలు పెట్టారట.

ఈ షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు పాల్గొంటున్నారట. ఇద్దరికి ఫైట్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ చరిత్రలో నిలిచిన రియల్ హీరోస్ కథనే కొద్దిగా కల్పితాన్ని జోడించి ప్రేక్షకుల మెప్పు పొందేలా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆర్.ఆర్.ఆర్ ఉంటుందట. సినిమాలో రాం చరణ్ కు జోడీగా అలియా భట్ సెలెక్ట్ అవగా ఎన్.టి.ఆర్ కు జతగా హీరోయిన్ ఇంకా ఫైనల్ అవలేదు.