బ్రేకింగ్ :షమీ భార్య హసీన్ జహాన్ అరెస్ట్

SMTV Desk 2019-04-29 15:56:23  mohammed shami, hasin jahan arrest

లక్నో: భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌ని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అమరోహలోని షమీ ఇంట్లోకి తను అక్రమంగా ప్రవేశించిందని తన తల్లి పోలీసులకి ఫిర్యాదు చేయగా.. సెక్షన్ 151 కింద పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. ఐపీఎల్ 2018 సీజన్ ముంగిట మహ్మద్ షమీపై వరకట్నం వేధింపులు, గృహ హింస‌ కేసులు పెట్టిన హసీన్ జహాన్.. ఆదివారం రాత్రి అతడి ఇంటిలోకి ప్రవేశించి.. అక్కడ షమీ తల్లితో గొడవపడింది. దీంతో.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జహాన్‌‌‌ని అరెస్టు చేశారు. గత ఏడాది షమీపై కేసులు పెట్టడంతో పాటు అక్రమ సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా జహాన్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్‌‌లో ప్రస్తుతం ఆడుతున్న మహ్మద్ షమీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడిన ఈ ఫాస్ట్ బౌలర్ 14 వికెట్లు పడగొట్టగా.. సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.