సెక్స్ మధ్యలో కండోమ్ తీస్తే...12ఏళ్ల జైలు శిక్ష!

SMTV Desk 2019-04-29 14:29:02  man removes his condom while had sex

ఇంగ్లాండ్: ఓ వ్యక్తి సెక్స్ మధ్యలో కండోం తీసినందుకు అతనికి 12ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇంగ్లాండ్‌ సర్కార్. పూర్తి వివరాల ప్రకారం... నైరుతి ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌లో లీ హొగ్బెన్ అనే వ్యక్తి ఓ హోటల్‌కి వేశ్యని తీసుకెళ్లాడు. వెళ్లే సమయంలో ఆమె అతనితో సెక్స్ చేస్తున్న సమయంలో కండోమ్ తప్పనిసరని చెప్పింది. దానికి లీ ఒప్పుకొని వేశ్యను హోటల్‌కు తీసుకెళ్లాడు. కానీ సెక్స్ సమయంలో లీ కండోమ్ తీసేశాడు. ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినకుండా లీ కండోమ్ తీసి సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో విసుగెత్తిన వేశ్య పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి రేప్ కేసు పెట్టారు. కానీ మొదట్లో లీ హొగ్బొన్ తాను చేసింది తప్పు కాదని వాదించాడు. అయితే డీఎన్ఏ ఆధారాలు సరిపోవడంతో కోర్టు అతనికి 12 ఏళ్ల శిక్ష విధించింది.