అవెంజర్స్: ఎండ్ గేమ్ వీరాభిమాని...సినిమా చూసి ఆసుపత్రిపాలు

SMTV Desk 2019-04-29 14:27:35  avengers end game, marvel comics, women watched avengers end game movi and admitted hospital

బీజింగ్: చైనాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవెంజేర్స్ ఎండ్ గేమ్ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డులు కొల్లగొడుతుంది. అయితే ఈ సినిమా అవెంజర్స్ సిరీస్‌లో ఇది చివరిది కావడంతో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ సినిమా చూసి తీవ్ర ఉద్వేగానికి లోనైన ఓ యువతి హాస్పిటల్ పాలైన సంఘటన చైనాలో సంచలనం రేకిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన షాలి అనే ఓ 21 ఏళ్ల యువతి థియేటర్‌లో అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా చూస్తూ కన్నీరుమున్నీరైంది. దాంతో శ్వాస తీసుకోలేక స్పృహకోల్పోయింది. దీనిని గమనించిన థియేటర్‌ సిబ్బంది షాలిని హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అవెంజర్స్ సిరీస్‌లో ఇది చివరి చిత్రం కావడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని షాలి తెలిపింది.