రేపు ఆస్తిపన్ను చెల్లింపు గడువు పూర్తి

SMTV Desk 2019-04-29 13:44:45  assets tax, early bird scheme, home tax, ghmc, property tax

హైదరాబాద్‌: ఏప్రిల్ 30న ఎర్లీ బర్డ్‌ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న ఆస్తిపన్ను చెల్లింపుల గడువు ముగియనుంది. రెండు రోజుల చివరి గడువును సద్వినియోగం చేసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులు కోరుతున్నారు. ఆదివారం పౌరసేవా కేంద్రాలు పనిచేయడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని, తద్వారా రూ. 9 కోట్ల మేర ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్ల రూపాయల సేకరణ లక్ష్యంలో భాగంగా ఈ నెల 30లోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేటును జిహెచ్‌ఎంసి గతంలో ప్రకటించింది.