పప్పు అనే లోకేష్‌కు తండ్రివేనని స్పష్టం చేశారు: ఆర్జీవి

SMTV Desk 2019-04-29 13:12:07  chandrababu, ram gopal varma, ys jagan mohan reddy, ysrcp, tdp, lakshmis ntr

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పని చేసిన చంద్రబాబు నాయుడు ఒక సినిమా పేరు చూసి భయపడడం మేంటని ఎద్దేవా చేశారు వర్మ. లక్ష్మీస్ ఎన్‌టిఆర్ పేరు వినగానే బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అడిగారు. ఈ సినిమాను చూసి మీరు నిజంగా భయపడుతున్నారంటే పప్పు అనే లోకేష్‌కు తండ్రివేనని స్పష్టం చేశారు. నిజాలు ఎప్పటికి దాగవని ఏదో ఒక రోజు బయటపడుతాయన్నారు. ఈ సినిమాకు మద్దతుగా నిలిచిన వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి ఆర్‌జివి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీస్ ఎన్ టిఆర్ సినిమా ఎపి లో తప్ప అన్ని ప్రాంతాలలో విడుదలైన విషయం తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను టిడిపి నాయకులు, చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఆర్జీవి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.