ఓటు వేసిన బాలీవుడ్ ప్రముఖులు

SMTV Desk 2019-04-29 12:50:03  Bollywood Actors, cast votes,

ముంబయి: దేశ వ్యాప్తంగా నాలుగో విడుత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల చెదురుముదురు ఘటనలు తప్పితే మిగితా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావ్… బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాధురీ తన ఓటును జుహులో వేశారు.