ముంబయి టీం నుంచి ఎలాంటి ప్రతిఫలం పొందలేదు: సచిన్

SMTV Desk 2019-04-29 12:16:27  sachin tendulkar, mumbhai indians, bcci, vvs lakshman

ముంభై: భారత క్రికెటర్ సచిన్ తెండూల్కర్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు రావడం తెలిసిందే. అంతేకాక క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి)లో సభ్యుడిగా ఉంటూ ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిసిసిఐ అంబుడ్స్‌మన్, ఎధిక్స్‌ఆఫీసర్ జస్టిస్ (రిటైర్డ్) డికె జైన్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా చేసిన ఫిర్యాదు మేరకు సచిన్ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారన్న ఆరోపణలతో జైన్ ఈ నోటీసులు పంపారు. సచిన్‌తో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న వివిఎస్ లక్ష్మణ్‌కు కూడా నోటీసులు అందాయి. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించిన సచిన ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌ నుంచి తాను ఎలాంటి ప్రతిఫలం పొందలేదని, అలాగే ఆ జట్టులో ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించడం లేదని బీసీసీఐకి స్పష్టం చేశారు. ఈ మేరకు వివరణ ఇస్తూ బిసిసిఐ అంబుడ్స్‌మన్ డికె జైన్‌కు ఒక లేఖ రాశాడు. మొత్తం14 అంశాలతో వివరణ ఇచ్చాడు.తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.