శశికళకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన డీఐజీ రూప..

SMTV Desk 2017-08-21 15:45:43  parappana jail, shashikala, video witness, dig roopa

బెంగళూరు, ఆగస్ట్ 21 : పరప్పన అగ్రహార జైల్లో శిక్షననుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఊహించని పరిణామం ఎదురైంది. శశికళ జైలు అధికారులకు 2 కోట్ల ముడుపులు చెల్లించి రాజ భోగాలను అనుభవిస్తుందని డీఐజీ రూప మోద్గిల్ ఆరోపించడంతో తనను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే శశికళ వీవీఐపీ మర్యాదలు పొందుతున్నారని డీఐజీ రూప సీబీఐకి స్పష్టమైన ఒక వీడియో ఆధారాన్ని అందించారు. ఈ వీడియోలో శశికళ ప్రధాన ద్వారం నుండి బయటికి వస్తున్న విజువల్స్ ఉండడం గమనార్హం. అంతేకాకుండా శశి విలాసాలపై 14 పేజీల నివేదికను కూడా అందజేశారు. సాధారణంగా ఖైదీలు, సాధారణ సిబ్బంది కూడా జైలు లోపలి గాని, బయటికి గాని వెళ్ళినప్పుడు ప్రధాన ద్వారానికి ఉండే చిన్న గేటు ద్వారానే రాకపోకలు సాగించాలి. కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ప్రధాన ద్వారం తెరిచే వెసులుబాటు ఉంటుంది. కాని డీఐజీ రూప చూపించిన పుటేజ్ ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడంతో పాటు శశికళకు జైలులో వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయనేది మాత్రం స్పష్టమవుతుంది.