హైదరాబాద్ కు రానున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్ కోడలు

SMTV Desk 2019-04-29 11:27:57  sophie helen rhys comming to hyderabad, sophie helen rhys visits hyderabad gandhi hospital

హైదరాబాద్: నేడు హైదరాబాద్ కి బ్రిటన్ రాణి ఎలిజబెత్ కోడలు సోఫీ హెలెన్‌రైస్ రానున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ఆర్‌ఒపి సేవలను ఆమె పరిశీలించనున్నది. ఇదిలావుండగా సోఫీ హెలెన్ వైస్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్న క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లిట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం ఆమె పర్యటించనున్నారు. ముఖ్యంగా చిన్నారుల కంటి శుక్లాలకు సంబంధించిన రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ సేవలను ఆ సంస్థ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సంస్థ ఆధ్వర్యంలో 2015 నుంచి సుమారు 4,0000 మంది చిన్నారులకు వైద్యసేలందించారు. దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు రాష్ట్రాలలో ఈ ట్రస్ట్ సేవలందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ, నీలోఫర్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రాల ఆసుపత్రులలో ఈ సేవలందుతున్నాయి. ఈ నేపథ్యంలో సోఫీ హెలెన్‌రైస్ గాంధీ, నీలోఫర్‌తోపాటు ఎల్‌వి ప్రసాద్ ఆసుపత్రిని ఆమె సందర్శించనున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు.