ఓట్లు లెక్కిస్తుండగా 272 మృతి....1878 మంది ఆస్పత్రిపాలు

SMTV Desk 2019-04-29 11:26:50  vote counting, 272 people died while vote counting, Indonesia, Jazeera

జకార్తా: ఇండోనేషియాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఎక్కువ సమయం పనిచేస్తూ ఓట్లు లెక్కిస్తుండగా 272 మృతి చెందారు. పని ఒత్తిడి పెరగడంతో ఉద్యోగులు చనిపోయారని అక్కడి ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో వందపైగా దీవులలో 193 మిలియన్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. గత నెలలో జరిగిన ఇండోనేషియాలో ఎన్నికలలో 80 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదు ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఒక్కో ఓటరు ఐదు ఓట్లు వేశారు. అక్కడ ఇప్పటికి బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరుగుతుంది. ఓట్లు లెక్కించడానికి తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్న ఉద్యోగులతోనే ఎక్కువ సమయం కేటాయించి ఓట్లను లెక్కిస్తున్నారు. దీంతో ఉద్యోగులకు విశ్రాంతి లేకపోవడంతో పని ఒత్తిడి పెరిగి వాళ్ల కాళ్లు, చేతులు వంకర్లు పోయి 272 దుర్మరణం చెందగా 1878 మంది ఆస్పత్రి పాలయ్యారని ఇండోనేషియా ఎన్నికల ప్రధాన అధికారి ఆరిఫ్ ప్రియో శిసాంటో వెల్లడించారు. దీంతో ఇండోనేషియా ప్రభుత్వం ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మే 22న ఫలితాలు విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ యోచిస్తోంది.