మిశ్రమంగా కదిలిన ఇంధన ధరలు

SMTV Desk 2019-04-29 11:24:50  Petrol, Deseal, Price, New delhi

న్యూఢిల్లీ: సోమవారం దేశీయ ఇంధన ధరలు మిశ్రమంగా కదిలాయి. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేకపోగా డీజిల్ ధర మాత్రం పైకి కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.08 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.66.66 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.65 వద్ద, డీజిల్ ధర రూ.69.77 వద్ద కొనసాగుతోంది. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.77.50 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.43 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.21 వద్ద, డీజిల్‌ ధర రూ.71.79 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.84, డీజిల్ ధర రూ.71.45 వద్ద కొనసాగుతోంది.