నెటిజ‌న్ పై మండిపడ్డ యాంకర్ అనసూయ

SMTV Desk 2017-08-21 14:26:04  tv anchor anasuya, instagram, jabardasth,

హైదరాబాద్, ఆగస్ట్21: టీవీ మీడియాలో లో యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితమే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో పక్క టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా అదరగొడుతుంది ఈ భామ. అయితే, గతంలో అనసూయ వస్త్రధారణపై కొందరు నెటిజన్ల నుంచి విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ఆమె వివరణ ఇచ్చుకున్నప్పటికీ కొందరు మాత్రం అలాంటి కామెంట్స్ చేయడం మానుకోవడం లేదు తాజాగా అనసూయ‌ దుస్తులు అసహ్యకరమని తన‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజ‌న్ పేర్కొనడంతో ఆమె అతడిపై మండిపడింది. ‘‘నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా’’ అని పోస్ట్ చేశాడు. దానికి అనసూయ..అయితే ఆ ప్రోగ్రాంలను చూడ‌కు అంటూ ఘాటుగా చెప్పింది. తాను ఏ దుస్తులు వేసుకోవాలో తనకు తెలుసని ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటే అదే చూస్తారని చెప్పుకోచ్చింది అనసూయ.