తొలిసారి ఎన్నికల ర్యాలీలో

SMTV Desk 2019-04-28 13:01:39  Sunny deol, BJP, rally

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ తొలిసారి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి రోడ్ షోలో పాల్గొనడంతో, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బార్మర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కైలాష్ చౌదరీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.